telugu navyamedia
క్రీడలు

టోక్యో ఒలింపిక్స్: క్వార్టర్ ఫైనల్స్‌లో మేరీ కోమ్ ఓటమి

మహిళా బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీ కోమ్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్ లో ఫ్లై వెయిట్ (48-51 కిలోలు) కేటగిరిలో నేడు జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ బౌట్ లో మేరీ కోమ్ ఓటమిపాలైంది. కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ వాలెన్సియా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది.

వీరిద్దరూ మధ్య పోరు ప్రారంభం అవ్వగానే ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. మేరీ కోమ్ ఈ బౌట్ లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. ప్రత్యర్థికి దీటుగానే పంచ్ లు కురిపించినా, పలు రౌండ్లలో కొలంబియా బాక్సర్ ఇంగ్రిట్ వాలెన్సియా ఆధిపత్యం సాగించింది. ఐదుగురు జడ్జీలు వాలెన్సియా 49 పాయింట్లు ఇవ్వగా మేరికోమ్‌కు 46 పాయింట్లు మాత్రమే కేటాయించారు.

Related posts