లోకనాయకుడు కమల్ హాసన్‌కి నవంబర్ 22న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కమల్‌కి హారతి ఇచ్చి స్వాగతించారు. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్న కమల్ ఆ తర్వాత ఇండియన్ 2 చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు. సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ 2016లో జరిగిన ప్రమాదంకి గాను రెండు లెగ్ సర్జరీలు చేయించుకున్నారు. గత శుక్రవారం ఆయన మరో సర్జరీ చేయించుకొని కాలిలో ఉన్న స్టీల్ ప్లేట్స్ తీయించుకున్నారు. నిజానికి ఈ సర్జరీ ఎప్పుడో చేయించుకోవలసి ఉన్నప్పటికి, సినిమాలు, రాజకీయాలతో ఉన్న బిజీ వలన వాయిదా పడింది. ఉలగనాయన్ కమల్ హాసన్ ఇటీవల భారతీయ సినిమాలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
previous post