telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్ “సరైనోడు” అరుదైన రికార్డు

Sarainodu

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన చిత్రం “సరైనోడు”. గీతా అర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించగా థమన్ సంగీతం అందించాడు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 70కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ విజయాన్నిసాధించింది. ఇక ఈ చిత్రం తాజాగా తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పట్లో దాదాపు ఎవరికి సాధ్యం కాని రికార్డును సృష్టించింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ను గోల్డ్ మైన్ టెలీఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఆ తరువాత హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా అతి తక్కువ సమయంలో కాలంలోనే 170 మిలియన్ వ్యూస్ ను రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది. ఒక టాలీవుడ్ సినిమా కు ఈ రేంజ్ లో వ్యూస్ రావడం అదే తొలిసారి. ఆ తరువాత ఎందుకో ఈ సినిమాను యూట్యూబ్ నుండి తొలగించారు. అయితే కొద్దీ రోజుల క్రితం మళ్ళీ అప్ లోడ్ చేయగా ఈరోజుతో 200 మిలియన్స్ వ్యూస్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. నార్త్ లో ఈ రేంజ్ లో వ్యూస్ ను రాబట్టిన టాలీవుడ్ సినిమా కూడా ఇదే. తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా క్రేజీ హీరోగా మారిపోయాడు.

Related posts