telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

వ‌చ్చేవారం నుంచి క్రికెటర్లకు ట్రైనింగ్

ECB

క‌రోనా వైర‌స్ కార‌ణంగా వాయిదా ప‌డిన క్రికెట్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తాజాగా ప్ర‌య‌త్నాల‌ను స్టార్ట్ చేసింది. వ‌చ్చేవారం నుంచి త‌మ ఆట‌గాళ్ల‌కు ట్రైనింగ్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 30 మంది సెంట్ర‌ల్ కాంట్రాక్టు ప్లేయ‌ర్ల‌ను 12 వేర్వేరు వేదిక‌ల్లో ఉంచి, ట్రైనింగ్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. తొలుత బౌల‌ర్లకు వ‌చ్చేవారం నుంచి శిక్ష‌ణ ప్రారంభిస్తారు. ఒక్కొక్క‌రు చొప్పున ట్రైనింగ్‌ను పూర్తి చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. రెండోవారం నుంచి బ్యాట్స్‌మెన్‌కు ట్రైనింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. యూకే ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఈ కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఈసీబీ డైరెక్ట‌ర్ ఆష్లీ గైల్స్ తెలిపాడు. అయ‌తే ఆట‌న‌ను తిరిగి ప‌ట్టాలెక్కించుకునేందుకు ఈ చ‌ర్య‌ల‌ని, జూలై తొలివారం వ‌ర‌కు ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండ‌బోవ‌ని పేర్కొన్నాడు. మ‌రోవైపు ట్రైనింగ్ స‌మ‌యంలో సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటించ‌డంతోపాటు, ఆట‌గాళ్ల‌కు చికిత్సనందించే వైద్య సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా పీపీఈ కిట్ల‌ను ధ‌రించాల‌ని ఈసీబీ ఆదేశించింది. అలాగే అంద‌రీ ఉష్ణోగ్ర‌త‌ల‌ను ప‌రిశీలించ‌డంతోపాటు, డ్రెస్సింగ్ రూం త‌దిత‌ర ఫెసిలిటీల‌ను మూసివేయ‌నున్న‌ట్లు పేర్కొంది. తాజా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వ‌చ్చే జూలైలో ఇంగ్లాండ్‌-వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య టెస్టు సిరీస్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

Related posts