telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చమ్మక్ చంద్ర హీరోగా “రామ సక్కనోళ్ళు”… ట్రైలర్ విడుదల

Ramasakkanollu

బుల్లితెరపై జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోతో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కమెడియన్లుగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇందులో ఉన్న న‌టులు మాత్రం ఓ రేంజ్‌లో సంపాదిస్తున్నారు. ఓ వైపు జ‌బ‌ర్ద‌స్త్ షోతో పాటు బ‌య‌ట కూడా కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు వాళ్లు. ఇప్ప‌టికే బుల్లితెర నుంచి వెండితెర వైపు జ‌బ‌ర్ద‌స్త్ న‌టుల అడుగులు ప‌డుతున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో చ‌మ్మ‌క్ చంద్ర కూడా వ‌స్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చిన్న సినిమాల్లో కేవ‌లం అక్క‌డ‌క్క‌డా కామెడి చేస్తూ క‌నిపించాడు. ఇకిప్పుడు ఈయ‌న ఏకంగా హీరో అవుతున్నాడు. “రామ‌ స‌క్క‌నోళ్లు” అనే సినిమాతో లీడ్ హీరోగా మారిపోతున్నాడు చంద్ర‌. స‌తీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కార్తికేన్ తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుద‌లైంది. పూర్తిగా గ్రామ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. కనీసం ఇలాంటి సినిమా వస్తుందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ కచ్చితంగా తను వెండితెరపై అలరిస్తారనని నమ్మకంగా చెబుతున్నాడు ఈయన. ఈ సినిమాలో ధన్‌రాజ్, వేణు సహా ఇంకా చాలా మంది ఇందులో కనిపిస్తున్నారు. బ్రహ్మాజీ, సాయాజి షిండే, బ్రహ్మానందం లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ ను వీక్షించండి.

Related posts