telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

న్యూ ఇయర్ వేడుకలు… సెలెబ్రిటీలు…

New year wishes

మరో ఏడాది కాలగమనంలో కలిసిపోగా… కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరుపుకున్న సంబరాలు అంబరాన్నంటాయి. చాలామంది సినిమా ప్రముఖులు విదేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అందులో కొందరు… సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి అమెరికాలో ఉన్నారు. కమల్ హాసన్, అర్జున్ సింగపూర్ లో అక్కడే ఉన్నారు. నాగచైతన్య, సమంతలు ఆమ్ స్టర్ డామ్ లో, విఘ్నేష్, నయనతారలు లాస్ వెగాస్ లో, న్యూ కపుల్ దీపిక, రణవీర్ లు లండన్ లో, అనుష్క, కోహ్లీలు సిడ్నీలో ఉండగా, సోనమ్ కపూర్, ఆనంద్ లు ఇండోనేషియాలో, కరీనా, సైఫ్ లు స్విట్జర్లాండ్ లో, అజయ్ దేవగణ్ తన కుటుంబంతో కలసి థాయ్ ల్యాండ్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. సాయి ధరమ్ తేజ్ అజర్ బైజాన్ లో, కాజల్ వియత్నాంలో, పూజా హెగ్డే న్యూయార్క్ లో, పాయల్ రాజ్ పుత్ ఫిజీలో, కైరా అద్వానీ మాల్దీవుల్లో, రాశీఖన్నా, ఆలియా భట్, కత్రినా కైఫ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ తదితరులు దుబాయ్ లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. మరికొందరు సినిమా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

Related posts