telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : సెలెబ్రిటీలు వీరే…?

Bigg-Boss-3

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా “బిగ్ బాస్-1” రియాలిటీ షోకు బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తరువాత నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన “బిగ్ బాస్-2” కూడా అంతే వివాదాస్పద అంశాలతో ముగిసింది. ఇప్పుడు “బిగ్ బాస్-3” కోసం బుల్లితెర అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. “బిగ్ బాస్-3″లో వ్యాఖ్యాతగా ఎవరు కన్పించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో ముఖ్యంగా స్టార్ హీరోలు వెంకటేష్, చిరంజీవిల పేర్లు విన్పిస్తున్నాయి. ఇక తాజాగా ఈ షోలో పాల్గొనబోయే సెలెబ్రిటీలు వీరేనంటూ కొంతమంది పేర్లు విన్పిస్తున్నాయి.

రేణు దేశాయ్, శోభిత ధూళిపాల, ఉదయభాను, యూట్యూబ్ స్టార్ జాహ్నవి (మహాతల్లి), గద్దె సిందూర, వరుణ్ సందేశ్, హేమచంద్ర, రఘు మాస్టర్, ‘జబర్దస్త్’ పొట్టి నరేశ్, కమల్ కామరాజు, జాకీ, మనోజ్ నందన్, నాగ పద్మిని తదితరులు పాల్గొననున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే “బిగ్ బాస్-2″లో అసలు సెలెబ్రిటీలే లేరనే విమర్శలు విన్పించాయి. అందుకే ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈసారి బిగ్ బాస్ సెట్ ను హైదరాబాద్ లో వేయడం లేదని సమాచారం.

Related posts