telugu navyamedia
సినిమా వార్తలు

“భారతీయుడు-2″కు అనిరుధ్ సంగీతం… స్పందించిన ఏఆర్ రెహ్మాన్

bharatiyudu2 movie shoot in Ukraine
సంచలన చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఏఆర్ రెహ్మాన్ సంగీతం దర్శకుడిగా లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడుగా గతంలో వచ్చిన “భారతీయుడు” చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథా కథనాల పరంగానే కాకుండా సంగీతం పరంగా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సంగీతం ఈ సినిమాను ఆ స్థాయిలో నిలబెట్టడానికి ఎంతో దోహదపడింది. దాంతో ఇప్పుడు “భారతీయుడు”కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న “భారతీయుడు-2″కు కూడా ఏఆర్ రెహ్మాన్ సంగీతం దర్శకుడుగా పని చేస్తాడని అంతా అనుకున్నారు.
కానీ శంకర్ మాత్రం అందరి ఆలోచనలను తలక్రిందులు చేస్తూ అనిరుధ్ ను సంగీత దర్శకుడుగా తీసుకున్నాడు. దీంతో శంకర్, రెహ్మాన్ లపై రకరకాలుగా పలు ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై ఏఆర్ రెహ్మాన్ స్పందించారు. “భారతీయుడు-2″కు నేనే సంగీత దర్శకుడుగా పని చేయాలని కమల్ భావించారు. కానీ శంకర్ తనకి నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. అందుకు కారణం ఒకే కాంబినేషన్లో వరుస సినిమాలు చేయడం కొత్తగా ఉండదని ఆయన భావించి ఉండొచ్చు. “2.ఓ” సినిమా కోసం పనిచేసి నేను చాలా అలసిపోయాను. నన్ను మరింత కష్టపెట్టకూడదని కూడా శంకర్ భావించి వుంటారు. అంతేతప్ప వేరే కారణాలు ఏమీ లేవు” అని స్పష్టం చేశారు.

Related posts