telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమితాబ్ పరామర్శలో చిరంజీవి రాజకీయాలు…?

Chiru

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని విస్తృతంగా ప్ర‌మోట్ చేసుకుంటున్న చిరు రీసెంట్‌గా ఏపీ సీఎం జ‌గ‌న్‌ని క‌లిసి సైరా సినిమా చూడాల‌ని కోరారు. ఇక బుధ‌వారం ఢిల్లీ వెళ్లిన చిరు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తమ తమ కుటుంబాలతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. అయితే ఇటీవల అమితాబ్ కు అనారోగ్య సమస్యలు ఏర్పడటంతో ప్రస్తుతం ఆయన ముంబాయ్ లోని ఒక ప్రముఖ హాస్పటల్ లో తన లివర్ సమస్యలకు వైద్యం చేయించుకుంటున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళి తన “సైరా”ను అనేకమంది రాజకీయ ప్రముఖులకు చూపించిన తరువాత చిరంజీవి ముంబాయ్ వెళ్ళి అమితాబ్ ను పరామర్శించి ఆ తరువాత హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.

‘సైరా’ కలక్షన్స్ గురించి వివరాలు అడిగిన అమితాబ్ తన మాటల మధ్యలో ఈ మధ్య చిరంజీవి అమరావతి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన విషయాలు, త్వరలో ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుంది అని వస్తున్న వార్తల గురించి అమితాబ్ చిరంజీవి ని అడిగినట్లు తెలుస్తోంది. ఈ మాటలు అమితాబ్ నోటి నుండి విన్న చిరంజీవి షాక్ అవ్వడమే కాకుండా ఇక తనకు రాజకీయాలు అన్నా పదవులు అన్నా పూర్తిగా మోజు తీరిపోయింది అని చెప్పినట్లు, అంతేకాదు భవిష్యత్ లో తాను ఏ రాజకీయ పార్టీలోను చేరనని తన అవసరం పవన్ కు ఉంది అని భావిస్తే అన్నీ కుదిరితే పవన్ ‘జనసేన’ కోసం కేవలం ప్రచారం చేస్తాను కానీ తనకు ఏపదవుల పట్ల ఆ శక్తిలేదు అంటూ నవ్వుతు అమితాబ్ కు సమాధానం ఇచ్చినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అమితాబ్ గత కొన్ని సంవత్సరాలుగా గుజరాత్ ప్రభుత్వానికి టూరిజమ్ బ్రాండ్ అంబాసిడర్ గా తన సేవలు అందిస్తున్నాడు. ఈ ఆసక్తితోనే చిరంజీవి ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నాడు అని వస్తున్న వార్తల పై క్లారిటీ అడిగి ఉంటాడు అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Related posts