telugu navyamedia
సినిమా వార్తలు

ఈసారి చెంప చెళ్ళుమన్పిస్తా… : చిన్మయి శ్రీపాద

Chinmayi-Sripada

గత కొన్నాళ్లక్రితం టాలీవుడ్ ను ఊపేసిన “మీటూ” ఉద్యమంలో భాగంగా సింగర్ చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ గీత రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ విషయంలో కొందరు చిన్మయికి మద్దతు పలకగా, మరికొందరు మాత్రం విమర్శలు చేశారు. కానీ చిన్మయి ఏమాత్రం తగ్గకుండా సందర్భం వచ్చిన ప్రతిసారీ అతడిపై విరుచుకుపడింది. తాజాగా వైరముత్తుపై చిన్మయి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.

అసలేం జరిగిందంటే… ఇటీవల నటి ఖుష్బూ తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి చెంప పగలగొట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన చిన్మయి వద్ద నెటిజన్లు ఈ విషయం ప్రస్తావించారు. దీనిపై స్పందించిన చిన్మయి “వైరముత్తు కనిపిస్తే ఈసారి కచ్చితంగా చెంప చెల్లుమనిపిస్తా.. అలా అయితేనే నాకు న్యాయం జరుగుతుందేమో” అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts