ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ దినదిన ప్రవర్ధమానమవుతూ ఇంత అభివృద్ధి చెందిందంటే అందుకు ముఖ్య కారకులు పద్మశ్రీ డివిఎస్ రాజు గారు , డాక్టర్ కె .ఎల్ .నారాయణ గారని అధ్యక్షులు కె .ఎస్ .రామారావు తెలిపారు .
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నూతన సంవత్సర వేడుకలను ప్రారంభిస్తూ రామారావు మాట్లాడుతూ .. 32 సంవత్సరాల క్రితం డివిఎస్ రాజు గారు దీనికి బీజం వేశారు.
ఆ తరువాత అధ్యక్షులుగా బాధ్యతలు చేప్పట్టిన డాక్టర్ కె .ఎల్ .నారాయణ గారి కృషి అనన్య సామాన్యం. బిల్డింగ్ ప్లాన్ నుంచి ప్రతిదీ ఆయన రూపొందించినవే, ఈరోజు ఈ సెంటర్ ఇంత పేరు సంపాదించిందంటే అందుకు నారాయణ గారిని అభినందించాలి అని చెప్పారు.
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సినిమావారి కోసం మొదలైంది , ఈ రోజున ఈ స్థితికి రావడానికి ఆ తరువాత వచ్చిన అధ్యక్షులు , కార్యదర్శులు ఎంతో కృషి చేశారని రామారావు చెప్పారు .
ఈ సందర్భంగా డాక్టర్ కె .ఎల్ .నారాయణ , ఆదిశేషగిరి రావు , కాజా సూర్యనారాయణ , సోమరాజు లను కల్చరల్ సెంటర్ తరుపున ఘనంగా సత్కరించారు.
డాక్టర్ కె .ఎల్ .నారాయణ మాట్లాడుతూ .. ఈ సెంటర్ ఎలా అభివృద్ధి చెందిందో రామారావు గారు చెప్పారు , ఇందులో అందరి సమష్టి కృషి వుంది , ఈరోజున మన అందరికీ గర్వకారణమైన ఈ సెంటర్ సభ్యలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పారు .
ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ .. గత 20 సంవత్సరాలుగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తో అనుబంధం వుంది , కార్యవర్గ సభ్యుడుగా , కార్యదర్శిగా , అధ్యక్షుడుగా పనిచేశాను , డివిఎస్ రాజు గారు , నారాయణ గారు , రామారావు గారు, నేను అందరమూ దీని అభివృద్ధిలో పాలు పంచుకున్నవారే అని చెప్పారు .
కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ .. కల్చరల్ సెంటర్ ఈ రూపుదాల్చడానికి తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పారు .
ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో 2024కు వీడ్కోలు చెబుతూ 2025కు స్వాగతం చెబుతూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి .
వందేమాతరం శ్రీనివాస్ , మంగ్లీ , మెహరీన్ బృందాలు అందించిన పాటలు , శివారెడ్డి మిమిక్రి ఆకట్టుకున్నాయి . శ్రీముఖి వ్యాఖ్యానం కార్యక్రమాన్ని మరింత ఆసక్తి కలిగించింది .
కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కె .ఎస్ .రామారావు , ఉపాధ్యక్షులు ఎస్ .ఎన్ .రెడ్డి , కార్యదర్శి తుమ్మల రంగారావు , సంయుక్త కార్యదర్శి శివా రెడ్డి , కోశాధికారి శైలజ , కార్యవర్గ సభ్యులు కాజా సూర్యనారాయణ , మురళీమోహన్ రావు , వరప్రసాదం రావు , ఏడిద రాజా , భాస్కర నాయుడు , బాలరాజు తదితరులు ఏర్పాట్లు చేశారు .


సల్మాన్ “పేపర్ టైగర్”… సింగర్ సంచలన వ్యాఖ్యలు