మండుటెండలతో తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఎండలు భగ్గుమంటున్నాయి. వడగాల్సులు, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ, వాడగాల్పులకు తట్టుకోలేక పక్షులు చెట్లపై నుంచి రాలిపోయి చనిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ అగ్గిలా మండుతోంది. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వేడిగాలులే వీస్తున్నాయి. భయంకరమైన ఎండతో నిన్న ఒక్కరోజే తెలంగాణలో వడదెబ్బకు 16 మంది మృతి చెందారు.ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
పలు జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. మరో వారం రోజుల పాటు వడగాల్పుల తీవ్రత పెరగనుందని అధికారులు సూచించారు. ఏపీలో కూడా ఎండలు మండిపోతున్నాయి. విశాఖ నగరంలో అయితే రోడ్డుమీదకు రావాలంటే ప్రజలు హడలిపోతున్నారు. ఈరోజు 12 గంటల వరకే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఓటమి విషయమై ఎవరినీ తప్పుబట్టడం లేదు: దేవెగౌడ