telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 18(శనివారం) రాశి ఫలాలు

మేషం : టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శుభదాయకం. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో మీ శ్రమకు, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృషభం : స్థిరాస్తి వ్యవహారాల్లో, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. నిరుద్యోగులకు అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

మిథునం : అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రమోషన్‌ లేదా ఇంక్రిమెంట్‌ లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. ఆరోగ్య౦ పరవాలేదు. నిరుద్యోగులుకు అనుకూలం.

కర్కాటకం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. ఆరోగ్య౦ జాగ్రత్త.

సింహం : ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య : ఉద్యోగంలో, అధికారులు, సహోద్యోగులు ఎంతగానో సహకరిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. మీ కోరికొకటి నెరవేరుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు బాగుంటుంది.

తుల : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న వ్యాపారులు లాభాలార్జిస్తారు.

వృశ్చికం : నిరుద్యోగులకు అనుకూలం. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. హామీలు కూడా ఇవ్వవద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

ధనస్సు : ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. వ్యాపారులు, వృత్తి నిపుణులకు అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త.

మకరం : కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. పెళ్ళి సంబంధం కుదురుతుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం : చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.

మీనం : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి పరవాలేదు. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి.

Related posts