చైనాలోని కింగ్‌డావో నగరంలో జరిగిన SCO (షాంఘై సహకార సంస్థ) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఒక ప్రత్యేక నిర్ణయంపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఈ విషయంలో భారతదేశం- చైనా మధ్య సానుకూల సంభాషణ జరిగింది.
SCO సమానత్వం, సంప్రదింపులు, పరస్పర ప్రయోజనం, ప్రాంతీయ బహుపాక్షిక సహకారం షాంఘై స్ఫూర్తిని కొనసాగిస్తుందని చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ అన్నారు.
ఇది సభ్య దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలపై సహకారాన్ని పెంచడానికి, పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి అవకాశాన్ని ఇచ్చే వేదిక అన్నారు.
పరస్పర సహకారాన్ని మరింతగా పెంచడంతో పాటు వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని కూడా పెంచుతుందని డాంగ్ జున్ అభిప్రాయపడ్డారు.
“కింగ్‌డావోలో జరిగిన SCO రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాన్ జున్‌తో చర్చలు జరిపాము.
ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశాలపై మేము నిర్మాణాత్మక మరియు భవిష్యత్తు దృక్పథంతో కూడిన అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాము.
దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాము.
ఈ సానుకూల ఊపును కొనసాగించడం మరియు ద్వైపాక్షిక సంబంధంలో కొత్త సంక్లిష్టతలను జోడించకుండా ఉండటం రెండు వైపులా బాధ్యత” అని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేసారు.
కుంతియా అనే ఐరన్‌లెగ్ వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం: సర్వే