ఓరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జనవరి 16 తెల్లవారుజామున ఓ ప్యాసెంజర్ తన ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎంత సేపటికీ తాను ఎక్కాల్సిన విమానం రాకపోవడంతో… తన ప్లే స్టేషన్ 4ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి అపెక్స్ లెజెండ్స్ అనే వీడియో గేమ్ ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఇందులో వింతేమిటంటే… ప్యాసెంజర్ తన ప్లే స్టేషన్‌ను ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫర్‌మేషన్ మోనిటర్‌కు కనెక్ట్ చేసి ఆడుకోవడమే ఇక్కడ అతిపెద్ద వింత. ప్యాసెంజర్ చేస్తున్న పనికి ఎయిర్‌పోర్టు సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ప్యాసెంజర్‌ను మందలించి ప్లే స్టేషన్‌ను డిస్‌కనెక్ట్ చేసేశారు. మరో ప్యాసెంజర్ ఈ దృశ్యాన్ని ఫొటో తీసి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయిపోయింది.
previous post
next post