నేచురల్ స్టార్ నాని రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. కోల్‌కతా నేపథ్యంలో వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ఇందులో సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మూడో నటికి ఛాన్స్ ఉండగా.. ఆ పాత్రకు మడోన్నా సెబాస్టియన్ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. “ప్రేమమ్” సినిమాతో ప్రేక్షకుల మనసు దోచిన నటి మడోన్నా. చానాళ్ల తర్వాత ఈ అందాల భామ టావీవుడ్ తెరపై నాని మూవీతో మరోసారి కనువిందు చేయనుంది.
previous post
పార్టీలో చేరిన తనకు పవన్ ఓ నాయకుడు: నాగబాబు