telugu navyamedia
Uncategorized

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించాల్సిందిగా కేసీఆర్ ను ప్రభుత్వం తరఫునఆహ్వానించిన కొండా సురేఖ, దనసరి సీతక్క

రాష్ట్ర దేవదాయ ధర్మదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల., మంత్రి దనసరి సీతక్క, గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసారు.

మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ గారికి మేడారం ప్రసాదం అందజేశారు.

ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు.

Related posts