telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

పట్టణ వార్డు వాలంటీర్ల పోస్టులకు … భారీ స్పందన ..

huge response to city ward volunteer jobs

తాజాగా నిర్వహించిన పట్టణ వార్డు వాలంటీర్ల పోస్టులకు స్పందన ఘననీయంగా ఉంది. ఈ పోస్టులకు సుమారు 81వేల మంది ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పురపాలక శాఖ ఇంటర్వ్యూలు నేటితో ముగిశాయి. 110 పట్టణాల్లో వార్డు వాలంటీర్ పోస్టుల కోసం చేపట్టిన ఎంపిక ప్రక్రియకు మొత్తం 1,68,993 దరఖాస్తులు అందగా, వాటిలో 1,58,474 మంది దరఖాస్తుదారులను అర్హులుగా నిర్ణయించి అధికారులు కాల్ లెటర్లు పంపారు.

నలుగురు మినహా దరఖాస్తు చేసుకున్న వారందరు ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఎంపికైన 81 వేల మందికి ఈ నెలాఖరులోగా నియామక ఉత్తర్వులు పంపించనున్నారు. ఆగస్టు మొదటి వారంలో వీరికి శిక్షణ ప్రారంభం కానుంది. ఆగస్టు 15 నుంచి వీరిని వార్డు వాలంటీర్ల వ్యవస్థలో నియమించనున్నారు.

Related posts