telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉత్తరకాశి జిల్లాలోని గంగ్నాని సమీపంలో హెలికాప్టర్ ప్రమాదం

ఉత్తరాఖండ్‌లో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తున్న భక్తులతో కూడిన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. అడవుల్లో కూలిన గంగోత్రి వెళ్తున్న పర్యాటకుల ప్రైవేట్ హెలికాప్టర్.

ఉత్తరకాశి జిల్లాలోని గంగ్నాని సమీపంలో ఈ సంఘటన జరిగింది, ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.

మృతుల్లో వేదవతి కుమారి కూడా ఉన్నారు, ఆమెను అనంతపురం పార్లమెంటు సభ్యడు అంబికా లక్ష్మీనారాయణ సోదరిగా గుర్తించారు.

48 ఏళ్ల  వేదవతి కుమారి   తీర్థయాత్రలో భాగంగా గంగోత్రికి వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఆమె భర్త, 51 ఏళ్ల ఎం. భాస్కర్, ప్రమాదంలో గాయపడ్డారు.

వైద్య చికిత్స కోసం వెంటనే ఆయనను రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఇదే సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయారెడ్డి అనే మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది.

రుషికేష్ బయల్దేరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ.

Related posts