హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ కురిసింది. గురువారం ఈ సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో గంటలతరబడి వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కోఠి, కాచిగూడ, బంజారాహిల్స్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అంబర్ పేట, జీడిమెట్ల ప్రాంతాల్లో రోడ్లపై నీరు పొంగి పారుతుంది. దీంతో వాహనాదారులు నానా తంటాలు పడుతున్నారు. మారేడ్ పల్లి, సంగీత్, ప్యారడైజ్, బేగంపేట, సికింద్రాబాద్, చిలకలగూడ, సీతాఫల్ మండీ ప్రాంతాలు సైతం తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షం కారణంగా వనస్థలిపురం, హస్తినాపురంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
previous post