ఐపీఎల్ 2020 లో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(53 ), ఓపెనర్ శిఖర్(57) అర్ధ శతకాలతో రాణించారు. ఇక ఆ తర్వాత162 పరుగులు లక్ష్యం తో బరిలోకి దిగ్గిన రాయల్స్ కు మంచి ఓపెనింగ్ ఏ లభించింది. ఓపెనర్లు బెన్ స్టోక్స్(41), జోస్ బట్లర్ (22) మంచి శుభారంభాన్ని అందించారు. కానీ ఆ తర్వాత వచ్చిన రాయల్స్ బ్యాట్స్మెన్స్ లో రాబిన్ ఉతప్ప(32) మినహా ఎవరు పరుగులు చేయలేదు. అంతే కానుండా ఢిల్లీ బౌలర్లు చివరి 5 ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఈ మ్యాచ్ లో ఢిల్లీ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ కి ఇది ఆరో విజయం కావడంతో 12 పాయింట్లతో ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వచ్చింది. ఇక ఢిల్లీ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, అన్రిచ్ నార్ట్జే చెరో రేడు వికెట్లు తీసుకోగా అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా ఒక్కో వికెట్ సాధించారు.
previous post