హైదరాబాద్ లో భారీగా పెరిగిన చికెన్ ధర మాంసాహార ప్రియులకు షాక్ ఇస్తోంది. కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న ధర చికెన్ ప్రియులకు చుక్కలు చూపిస్తోంది.
గత వారం కిలో స్కిన్ లెస్ చికెన్ రేట్ 260 నుంచి 280 మధ్యలో ఉంది. ఇప్పుడు అది ఏకంగా రూ. 300కు చేరుకుంది. ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిందని… కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా పెరిగాయని తెలిపారు. జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పారు.
పెరిగిన చికెన్ ధరలతో రీటైల్ చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. వినియోగదారులు చికెన్ షాపులకు వెళ్లడాన్ని తగ్గించేశారు.
మొన్నటి వరకు రోజుకు 20 కిలోల చికెన్ అమ్మేవాడినని… ఇప్పుడు 10 కిలోలు మాత్రమే సేల్ అవుతోందని ఒక వ్యాపారి ఆవేదన.