కార్మికులకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు.
శ్రామిక, కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. ..టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన తో లక్షల మంది ఉపాధి పొందారని చంద్రబాబు గుర్తిచేశారు.
నాటి టీడీపీ పాలనలో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పవర్ హాలిడేలతో అల్లాడిపోతుంటే.. కార్మిక లోకం తల్లడిల్లి పోతుందని అన్నారు. కనీసం కార్మికులకు ప్రమాద బీమా కూడా ఇవ్వలేని పరిస్థితి నేడు ఏర్పడిందని అన్నారు.
కార్మిక లోకమంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్పూర్తితో పోరాడాలని సూచించారు. . కార్మిక, శ్రామిక లోకానికి మేలు చేసే ఏ పోరాటానికైనా తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుందని ట్వీట్ చేశారు చంద్రబాబు.
శ్రామిక, కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో లక్షల మంది ఉపాధి పొందారు.నాటి టీడీపీ పాలనలో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది(1/3)#LabourDay
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2022
దాడులు చేయడం ఈ ప్రభుత్వానికి అటవాటే: గోరంట్ల