యంగ్ హీరో శర్వానంద్ రైతుపాత్రలో ‘శ్రీకారం’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు. శర్వా సరసన ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవలే చిత్ర యూనిట్ ఒక కీలక షెడ్యూల్ కు తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ‘భలేగుంది బాల’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఫుల్ లిరికల్ సాంగ్ ను నవంబర్ 9న విడుదల చేయనున్నారు.
కాగా శర్వానంద్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. వరుసగా సినిమాలను ఒకే చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే బి.కిశోర్‌రెడ్డి దర్శకత్వంలో ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్న శర్వా అజయ్ భూపతితో ‘మహాసముద్రం’ అనే సినిమా, అలాగే తిరుమల కిషోర్ దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా కూడా చేస్తున్నాడు.


శృంగార తార నడుముపై దర్శకుడు అసభ్యంగా…