మహా నటుడు, ప్రజా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు గారి 102వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ‘తారకరామం’ పుస్తకాన్ని బహుకరించానని సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథ తెలిపారు.
ఎన్ .టి.ఆర్ సెంటినరీ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ ఆధ్వర్యంలో ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా ‘శకపురుషుడు’ , ‘తారకరామం’ రెండు పుస్తకాలు తన సంపాదకత్వంలో వెలువడ్డాయని తెలిపారు.
తారకరామం పుస్తకాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు , భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారని భగీరథ చెప్పారు.
మే 28 ఎన్ .టి.ఆర్ 102వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని బుధవారం వారి నివాసంలో కలసి ‘తారకరామం’ పుస్తకాన్ని బహుకరించానని ఆయన చెప్పారు .
1950 నుంచి 1995 మధ్యకాలంలో రామారావు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ లతో ఈ పుస్తకం రూపొందింది .
ఎన్ .టి .ఆర్ జయంతి రోజు ‘తారకరామం’ ప్రత్యేక సంచికను బహుకరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పారని భగీరథ తెలిపారు .
బాలకృష్ణ హీరో… ఆయనంటే ప్రత్యేక గౌరవం… : నాగబాబు