బాలయ్య బాబు చిన్నతనం నుండి చురుకుతనంతోపాటు అన్నగారి నటన ను గమనిస్తూ అనుకరించేవారు.
పువ్వు పుట్టగానే పరిమళించును కదా అన్న లోకోక్తిని నిజం చేశారు.
చిన్నారి బాలయ్య బాబు ఆలోచనలను పరికించిన అన్న గారి ప్రోత్సాహంతో తాతమ్మకల చిత్ర ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించి సినీ జైత్రయాత్ర ను మొదలుపెట్టారు.
అక్కడి నుండి రామ్ రహీం , వేములవాడ భీమకవి , దానవీరశూరకర్ణ , శ్రీమద్విరాట్ పర్వం , శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, బాబాయి అబ్బాయి , పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య , సీతా రామ కళ్యాణం , అనసూయమ్మ గారి అల్లుడు దేశోద్ధారకుడు , భార్గవ రాముడు, అల్లరి కృష్ణయ్య, ప్రెసిడెంట్ గారి అబ్బాయి , మువ్వగోపాలుడు, రాము, భానుమతి గారి మొగుడు , ఇన్స్పెక్టర్ ప్రతాప్ , రాముడు భీముడు , ముద్దుల మామయ్య , నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్ , తల్లిదండ్రులు , బ్రహ్మర్షి విశ్వామిత్ర , ధర్మక్షేత్రం , అశ్వమేధం , నిప్పురవ్వ , బంగారు బుల్లోడు , భైరవద్వీపం , బొబ్బిలి సింహం , శ్రీకృష్ణార్జున విజయం , పెద్దన్నయ్య.
పెద్దన్నయ్య చిత్రం శత దినోత్సవ వేడుకల కార్యక్రమంలో భాగంగా కర్ణాటక కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆనాడు శ్రీ నందమూరి రామకృష్ణ బాబు గారికి ప్రమాదం జరిగినది.
ఆ చిత్రానికి శ్రీ రామకృష్ణ బాబు గారు నిర్మాతగా వ్యవహరించారు.
ముద్దుల మొగుడు , వంశోద్ధారకుడు , గొప్పింటి అల్లుడు , లక్ష్మీనరసింహ ,అక్బర్ సలీం అనార్కలి, అన్నదమ్ముల అనుబంధం, బ్రహ్మంగారి చరిత్ర, బ్రహ్మంగారి చరిత్రలో సిద్దయ్య పాత్రలో శ్రీ బాలయ్య బాబు అద్భుతంగా నటించారు.
అపూర్వ సహోదరులు, కథానాయకుడు, మంగమ్మగారి మనవడు, కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించిన జననీ జన్మభూమి చిత్రంలో శ్రీ బాలయ్య బాబు గారి లో ఉన్న నటనను అత్యద్భుతంగా బయటికి తీసిన చిత్రం.
రౌడీ ఇన్స్పెక్టర్, ప్రముఖ దర్శకులు శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో నటించిన ఆదిత్య 369 ప్రేక్షకులను మనోరంజకంగా అలరించింది.
నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, లెజెండ్, అఖండ, భగవంత్ కేసరి ఈ చిత్రాలలో నందమూరి వారి వాడిని వేడిని చూసి ఒక్క నిమిషం పాటు అన్నగారిని కూడా మరిపిస్తాడా అన్న భావన కలిగింపజేశారు.
ఇదంతా ఆ దేవదేవుడైన అన్న ఆశీస్సులు తో జరుగుతున్నది. శ్రీ బాలయ్య బాబు నటనతోనే సరి పెట్టుకోలా రాజకీయ రంగంలో కూడా అద్భుతంగా రాణించి హిందూపురం ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచి అక్కడి ప్రజలకు అత్యంతగా చేరువయ్యారు.
సామాజిక సేవారంగంలో భాగంగా హిందూపురం నియోజకవర్గం పరిధిలో అక్కడి ప్రజలకు అనేక రంగాలలో ఆయన సహాయపడ్డారు.
విద్య ,వైద్యం, ఆరోగ్యం, మంచినీటి సౌకర్యం, రోడ్లు హాస్పిటల్స్. ఆరోగ్యపరంగా రోగులకు కావలసిన పరీక్షా కేంద్రాలు, విద్యార్థులకు కావలసిన సాంకేతిక నిపుణుత కలిగిన కేంద్రాలను వారికి తన సొంత ఖర్చులతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనపాటి శ్రీ బాలయ్య బాబు.
అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి చే ప్రారంభించబడిన శ్రీమతి బసవ రామతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు చైర్మన్గా బాధ్యతలు తీసుకుని లాభాపేక్ష లేకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న మానవతా మూర్తి శ్రీ బాలయ్య బాబు.
ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు రూపాయి ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలను తను భరిస్తూ, ఇంకా రాజకీయ కక్షల నేపద్యంలో బాధితులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి పార్టీ కార్యకర్తల కుటుంబాలకు చేయూతనిచ్చి, వారి పిల్లల విద్యకు దోహదపడుతూ భవిష్యత్ మార్గంలో వారికి జీవితంలో నిలబడే విధంగా ఏర్పాటు చేస్తున్న గొప్ప వ్యక్తి శ్రీ బాలయ్య బాబు.
శ్రీ నందమూరి రామకృష్ణ బాబు గారితో కలిసి తను శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అనుక్షణం అప్రమత్తతో అండగా ఉంటున్న తీరు బహుదా ప్రశంసనీయం.
శ్రీ బాలయ్య బాబు గారు చేసిన అనేక సేవా కార్యక్రమాల వివరాలు మనం పూర్తిగా అందించలేం.
వారు అనేక గుప్త దానాలు చేసి ఉన్నారు. నూటికి నూరు శాతం అన్నగారి గుణగణాలను ఉనికిపుచ్చుకున్న మాననీయుడు మన బాలయ్య బాబు.
మన అన్న దేవదేవుని ఆశీస్సులతో శ్రీ బాలయ్య బాబు వారి కుటుంబం సుఖ సంతోషాలతో ప్రజాజీవితంలో ఉంటూ ప్రజలతో మమైకమై వారి హృదయాలలో అన్నగారిలా గూడు కొట్టుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎన్టీఆర్ కళాపీఠం తరఫున శ్రీ బాలయ్య బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు . ~ చంద్ర ప్రసాద్ , ఎన్టీఆర్ కళా పీఠం, బాపట్ల.

