telugu navyamedia
Uncategorized

కేజీఎఫ్ 2 తర్వాత యష్ ఎవరితో సినిమా చేయనున్నాడు..?

kgf

కన్నడ సినిమా పరిశ్రమ గౌరవాన్ని పెంచి కేజిఎఫ్ ను పాన్ ఇండియా ఫిలింగా నిలబెట్టారు.యష్ హీరోయిజానికి ఎంటైర్ ఇండియన్ సినీ లవర్స్ ఫిదా అయ్యారు. గ్రాండియర్ లుక్ తో అటు సినిమాకు ఎంత పేరు వచ్చిందో హీరోగారికి అంతే పేరు వచ్చింది.ఒక రకంగా చెప్పాలంటే ఈసినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. యష్ కు వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే చాలామంది బాలీవుడ్ నిర్మాతలు… ట్రై చేశారు.ఐతే ఏ ఒక్కరికి అతను అంతగా రెస్పాండ్ అయ్యింది లేదు.చేద్దాం చూద్దాం అనే అంటున్నాడు తప్ప మరో మాట మాట్లాడితే ఒట్టు.ఐతే గత కొన్ని రోజులుగా తమిళ అగ్రదర్శకుడు శంకర్ ..యష్ తో సినిమా చేస్తున్నాడనే రూమర్ కన్నడ పరిశ్రమలో గట్టిగా నడుస్తుంది. ఇప్పటికే శంకర్ చెప్పిన కథకు యాష్ లాక్ అయ్యాడని కేజిఎఫ్ 2 రిలీజ్ తర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేస్తారని చెబుతున్నారు.ఐతే ప్రస్తుతం ఇండియన్ 2 సెట్స్ పైనే ఉంది.ఇది ఉండగా మరో సినిమా శంకర్ చేసే ఛాన్స్ లేదు.కమల్ కూడా లోకేష్ తో మరో సినిమాకు కమిట్ కావడంతో చేసేది లేక శంకర్ ఇలా యాష్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. యష్,శంకర్ ముచ్చట ఇలా ఉంటే..కన్నడిగులు మాత్రం రాజమౌళి యష్ తో సినిమా చేయాల్సిందే అంటున్నారు.గత కొంతకాలంగా నెట్టింట్లో రాజమౌళిని ట్యాగ్ చేస్తూ మీరు చేసే తర్వాతి ఫిలిం యష్ తోనే ఉండాలంటున్నారు.కన్నడలో ఒకరిద్దరు బడా దర్శకులు తమ తర్వాతి ప్రాజెక్ట్ లను ఈ హీరోతోనే అనుకుంటున్నప్పటికీ ఎవ్వరకీ మనోడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు.కేజిఎఫ్ సిరీస్ తర్వాతనే తన డెసిషన్ చెబుతానంటున్నాడు.బహుశా యష్ కూడా ..ప్రభాస్ మాదిరిగా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేయాలనే తలంపుతో ఉన్నాడంటున్నారు ఫిల్మీ క్రిటిక్స్ .

Related posts