ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19పై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ జోకులు పేల్చుతున్నారు. కరోనావైరస్తో అందరూ సెల్ఫ్ ఐసోలేషన్(స్వీయ నిర్బంధం)లో ఉంటున్నారని..దీనిపై 99.999 శాతం పెళ్లైన జంటలు సంతోషంగా ఉన్నారని ఇప్పటికే వ్యంగ్యంగా ట్వీట్ చేశారు వర్మ. తాజాగా కరోనావైరస్ని బాహుబలి సినిమాకు ముడిపెడితూ.. మరో ట్వీట్ పోస్ట్ చేశారు ఈ సంచలన దర్శకుడు. బాహుబలి-2 క్యూలైన్లను కరోనా మించి పోయిందంటూ ఫన్నీగా స్పందించారు. దీనికి కారణం కూడా ఉంది. కరోనా దెబ్బకు అమెరికాలో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోతున్నాయి. విద్యా, వ్యాపార సంస్థలు, మాల్స్ మూతపడ్డాయి. ఐతే రాబోయే రోజుల్లో కరోనా ప్రభావం మరింత తీవ్రంతా ఉండబోతుందన్న వార్తల నేపథ్యంలో అమెరికన్లు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా నెల రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు తెచ్చిపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సూపర్ మార్కెట్ వద్ద కిలోమీటర్ల మేర క్యూ కనిపించింది. ఈ వీడియోనే షేర్ చేశారు ఆర్జీవీ. అక్కడ కనిపించిన క్యూలైన్.. బాహుబలి-2 టికెట్ల క్యూలైన్లను మించిపోయిందని సరదాగా కామెంట్ చేశారు.
It finally took coronavirus to beat the queues of @ssrajamouli ‘s Bahubali 2 ..Panicked Americans line up outside a shopping mart ..Scary sight pic.twitter.com/Yus7Urftw2
— Ram Gopal Varma (@RGVzoomin) March 18, 2020