త్వరలో జరగబోయే మా 2021 ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయా?. ‘మా’ అధ్యక్ష పదవికి త్రికోణ పోటీ జరగనుందా? తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నట్లు ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించారు. లేటెస్ట్ గా ఫైర్ బ్రాండ్ నటి జీవిత కూడా పోటీలోకి దిగుతున్నారని టాక్. ప్రస్తుతం జీవిత ‘మా’ సెక్రెటరీగా ఉన్నారు. తన పనితీరుతో ఆమె “మా” సభ్యుల మన్నన పొందారు. ఐతే, అధ్యక్ష పదవిలో ఉంటే తాను ఇంకా ఎక్కువగా మా సభ్యులకు సేవ చెయ్యగలనని ఆమె భావిస్తున్నారట. ఇప్పటికే ఆ ప్రయత్నంగా ఆమె అడుగులు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక నటీమణి ‘మా’ ప్రెసిడెంట్ గా పోటీపడితే ఈ సారి ఎన్నికలు చాలా వేడివాడిగా మారుతాయి.
previous post


“ఆపమ్మా కొంచెం… నీకు బోర్ కొట్టట్లా…” ఫోటోగ్రాఫర్పై మహేష్ పంచ్