‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమై తొలి చిత్రంతోనే నంది అవార్డు దక్కించుకున్నారు నందినీరెడ్డి. కిందటేడాది ‘ఓ బేబీ’తో హిట్టు కొట్టారు. సమంత నటించిన ఈ సినిమాతో నందినీరెడ్డికి కూడా మంచి పేరు వచ్చింది. ఇదిలా ఉంటే, ఆమె మరోసారి సమంతతో జతకడుతున్నారని గతకొద్ది రోజులుగా రూమర్లు వస్తున్నాయి. ఇది ఒక రీమేక్ చిత్రమని కూడా అన్నారు. అంతేకాదు, ఈ సినిమాలో తనతో పాటు నటించడానికి నాగచైతన్యను సమంత ఒప్పించారని కూడా వదంతులు వచ్చాయి. అయితే, వీటిపై తాజాగా నందినీరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఒకవేళ సమంతతో నా తరవాత సినిమా చేస్తే మేమే ఎంతో ఆనందంగా ప్రకటిస్తాం. ఇప్పుడు, నెక్ట్ రూమర్ టైమ్ వచ్చింది. ఈ రూమర్‌కు నా రేటింగ్ 1/5. నిరుత్సాహపడొద్దు మీరింకా బాగా రూమర్లు సృష్టించగలరు అంటూ చమత్కారంగా ట్వీట్ చేశారు నందినీరెడ్డి.
My next is not a remake . It’s an original script produced by @SwapnaCinema .Whenever @Samanthaprabhu2 n I do our next we will announce it with a lot of joy and pride . Now, time for the next rumour …..😴…my rating for this rumour is 1/5…. come on guys u can do better 👆🏼
— Nandini Reddy (@nandureddy4u) April 15, 2020