telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ సేతుపతి “సంగ తమీజన్” ట్రైలర్

Vijay-Sethupathi

విజయ్ చందర్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “సంగ తమీజన్”. ఈ చిత్రంలో రాశీ ఖ‌న్నా, నివేదా పేతురాజ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొదటిసారి విజయ్ సేతుపతి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్-మీనన్ ద్వయం సంగీతం అందిస్తుండగా అక్టోబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో యాక్ష‌న్‌, రొమాన్స్ , కామెడీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయి. విజ‌య్ సేతుప‌తి తెలుగులో సైరా చిత్రంతో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌తో విజ‌య్‌కి తెలుగులోను మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డం ఖాయం. మ‌రి తాజాగా విడుద‌లైన “సంగ త‌మీజ‌న్” చిత్ర ట్రైలర్‌ ను మీరు కూడా వీక్షించండి.

Related posts