telugu navyamedia
ఆరోగ్యం

జొన్న రొట్టెలు, చపాతీలు తింటే బరువు తగ్గుతారా ?

Roti

గోధుమ రొట్టెలు, ముడి బియ్యంకంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంస కృత్తులు, పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. కాస్తంత తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. అయితే రొట్టెలు, ముడి బియ్యం, కొర్ర బియ్యం… ఏదైనాసరే వాటితో పాటు తీసుకునే కూర, పప్పు పరిమాణాన్ని బట్టి కూడా బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రతి ధాన్యంలో దానికే ప్రత్యేకమైన కొన్ని పోషకాలు ఉంటాయి. కాబట్టి ఒకే ధాన్యపు వంటకాన్ని రోజూ తినకుండా, అన్ని రకాల ధాన్యాలనూ తీసు కోవాలి. ఆకుకూరలనూ కాయగూరలనూ ఎక్కువగా తినడం మంచిది. వెన్న తీసిన పాలు, పెరుగు వినియోగించాలి. దీంతో పాటు శారీరక వ్యాయామం చేయాలి. తగినంత నిద్రపోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే బరువు తగ్గడం తేలికవుతుంది.

Related posts