telugu navyamedia
ఆరోగ్యం

నేచురల్‌గా ప్లేట్‌లెట్స్‌ పెంచుకోండిలా..

డెంగీ ఫీవర్‌ తో ముఖ్యంగా రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కణాలు తగ్గిపోతాయి. అయితే సరైన ఆహారం తీసుకోవడంతో ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య‌నుపెంచుకోవ‌చ్చు. సాధారణంగా ప్లేట్‌లెట్స్‌ కణాలు మన శరీరంలో 1,50,000–4,50,000 వరకు ఉంటాయి. ఇవి మనకు ఏవైనా గాయాలు అయినపుడు రక్తాన్ని గడ్డకట్టేలా సహాయపడతాయి. ప్లేట్‌లేట్స్‌ సంఖ్య తగ్గిపోతే ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. వీటి సంఖ్య తగ్గినపుడు తీవ్రమైన జ్వరం, బీపీ, హార్ట్‌ అటాక్, నీరసం వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు ప్లేట్‌లేట్స్‌ తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్త పరీక్ష ద్వారా వీటి సంఖ్యను తెలుసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంతో వీటి సంఖ్యను పెంచుకోవచ్చు.

* ప్లేట్‌లెట్స్‌ను పెంచడానికి ఇది మంచి ఫుడ్‌. ఎనిమియాతో బాధపడేవారు బీట్‌రూట్‌ను కచ్ఛితంగా తినాలి.
* క్యారెట్‌ వారంలో కనీసం రెండుసార్లు తినాలి.
*బొప్పాయి, వెల్లుల్లి తినడం వల్ల ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరుగుతుంది.

*విటమిన్‌ k పుష్కలంగా ఉండే ఆకుకూరలు తినడం వల్ల ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరుగుతుంది.
*దానిమ్మ.. ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్స్‌ పెంచడానికి సహాయపడుతుంది.
*ఐరన్‌ ఎక్కువగా ఉన్న పండ్లలో అప్రికట్‌ ఒకటి. ప్రతిరోజూ రెండు తినడం వల్ల ప్లేట్‌టెట్స్‌ సంఖ్య పెరుగుతుంది.
*ఎండుద్రాక్ష.. ఇందులో 30 శాతం ఐరన్‌ ఉంటుంది. దీంతో నేచురల్‌గా ప్లేట్‌లెట్స్‌ సంఖ్యను పెంచుకోవచ్చు.
*ఖర్జూరంలో కూడా ఐరన్‌తోపాటు ఇతర న్యూట్రియెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్యను పెంచడానికి తొడ్పడతాయి.
* కివీ పండ్ల‌ను తింటున్నాప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవ‌చ్చు.
*ముందు జాగ్రత్తగా దోమలు రాకుండా ఉండటానికి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.

Related posts