telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏనుగుల బెదిరింపుపై చర్యలకు శ్రీకారం: ప్రజల రక్షణకు పవన్ కల్యాణ్ ఆదేశాలు

గత కొన్నేళ్లుగా ఏనుగులు అటవీ ప్రాంతాలను వదిలి జనావాసాల్లోకి ప్రవేశిస్తూ, పొలాల్లో పనిచేసుకుంటున్న వారిపై దాడులు చేసి చంపేస్తుండడం తెలిసిందే.

ఏపీలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇటీవలే చిత్తూరు జిల్లాలో రామకృష్ణంరాజు అనే రైతు ఏనుగుల దాడిలో బలయ్యాడు.

నిన్న సోమవారం కూడా తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో పంప్ హౌస్ వద్ద ఏనుగులు కనిపించాయి. సమీపంలోని పొలాలను ధ్వంసం చేశాయి.

ఈ నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. తన శాఖ అధికారులు ఆయన ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఏనుగుల గుంపులు పొలాలపైకి రాకుండా, వాటిని అటవీ ప్రాంతంలోకి పంపించే చర్యలను పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు.

ఏనుగుల సంచారం ఉండే ప్రాంతాల్లో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తుండాలని, గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఏనుగుల తాకిడిపై వారికి ముందుగా సమాచారం అందిస్తుండాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏనుగుల ప్రభావిత గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

Related posts