గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఓ మాట పదే పదే తెరపైకి వస్తుంది. అదే కేటీఆర్‌ను సీఎం అవుతున్నాడు అనేది. ఈ మధ్య కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం కూడా పెట్టేశారనే వార్తలు హల్చల్ చేచస్తున్నాయి… మరి గులాబీ బాస్ మదిలో ఏముందో తెలియదు కానీ.. సీనియర్ మంత్రులు సైతం.. కేటీఆర్‌కు జై కొడుతున్నారు.. ఇక, ఎమ్మెల్యేల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.. సందర్భం వచ్చినప్పుడల్లా.. కేటీఆరే సీఎం కావాలంటూ తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. తాజాగా అయితే.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ సీఎం మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కంటే.. ఈటల రాజేందర్‌ను చేస్తే బాగుంటుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేటీఆర్ సమర్ధుడే కావొచ్చు.. కానీ కేటీఆర్‌పై విమర్శలు వస్తాయన్నారు. అదే ఈటలపై విమర్శలు రావని.. అతను సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. కేంద్రం.. రాష్ట్రం ఒకరిపై ఒకరు నెపం మోపుతున్నారని మండిపడ్డ జీవన్‌రెడ్డి… రైతుల పక్షాన మాట్లాడుతున్న ఏకైక మంత్రి ఈటల అని అభినిందించారు.
							previous post
						
						
					
							next post
						
						
					


మంత్రివర్గ నిర్ణయాలు తప్పని చట్ట సభలో రుజువైంది: యనమల