‘విండోస్ 10’ స్మార్ట్ ఫోన్ లు వాడే వారికి టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షాకిచ్చింది. ‘విండోస్ 10’ స్మార్ట్‌ఫోన్లకు ఇక తమ సపోర్ట్ ఉండదని సంచలన ప్రకటన చేసింది. కాబట్టి యూజర్లు ఆండ్రాయిడ్‌కు కానీ, లేదంటే ఐవోస్‌లకు కానీ మారిపోవాలని సూచించింది. డిసెంబరు 10 తర్వాత విండోస్ 10 ఫోన్లకు సెక్యూరిటీ అప్‌డేట్స్ నిలిపివేసినట్టు తెలిపింది. 
మైక్రోసాఫ్ట్‌కు చెందిన వర్చువల్ అసిస్టెంట్ కోర్టానా ఇకపై అమెజాన్ అలెగ్జాకు కానీ, గూగుల్ అసిస్టెంట్‌కు కానీ నేరుగా ఎటువంటి పోటీ కాదని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్ మొబైల్ సపోర్ట్ ఆగిపోతుందన్న ఉద్దేశంతో 2017లో న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ 36 వేల విండోస్ ఫోన్లను స్క్రాప్ కింద పడేసినట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.


