ప్రపంచకప్ సమరం ఈరోజు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఓ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. ‘Google’ అన్న అక్షరాల్లో ‘o’ అక్షరాన్ని బంతితో ‘L’ అక్షరాన్ని వికెట్స్‌తో, మధ్యలోంచి బౌలర్ బంతి వేస్తున్నట్లుగా డూడుల్‌ను డిజైన్ చేసింది. ప్రత్యేకమైన రోజుల్లో, పండుగ వేళల్లో గూగుల్ ఇలా ఆకర్షణీయమైన డూడుల్స్‌ను రూపొందిస్తూ ఉంటుంది.
ఈ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పది జట్లు రౌండ్‌రాబిన్ పద్ధతిలో 48 మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరనున్నాయి. ఈరోజు ఓవల్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.