telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక సామాజిక

“రియల్ మి” వినియోగదారులకు బ్యాడ్ న్యూస్… గుడ్ న్యూస్ కూడా…!

Real-Me

చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ కూడా షియోమీ బాటలోనే నడవనుంది. ఎంతోమంది వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ గా నిలిచే ఆ వార్తేంటంటే.. షియోమీ తరహాలోనే రియల్ మీ ఫోన్లలో కూడా ఇకపై అడ్వర్టయిజ్ మెంట్లు రానున్నాయి. అయితే బ్యాడ్ న్యూస్ లో కూడా గుడ్ న్యూస్ ఏంటంటే.. ఒక్క క్లిక్ తో మనం ఆ యాప్స్ ను డిసేబుల్ చేయవచ్చు. షియోమీ ఫోన్లలో కూడా ఇటువంటి యాడ్లు ఎన్నో వస్తాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వాటి తరహాలో కాకుండా రియల్ మీ ఫోన్లలో ఒక్క క్లిక్ తో మనం యాడ్లను డిసేబుల్ చేయవచ్చు. కలర్ ఓఎస్6, ఆ పైన ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేసే రియల్ మీ ఫోన్లకు తర్వాత అప్ డేట్ నుంచి యాడ్లు రానున్నాయి. ‘commercial content recommendation’ ద్వారా వినియోగదారులు ఈ యాడ్లను గుర్తించవచ్చు. అప్ డేట్ అయిన అనంతరం ఫోన్ మేనేజర్ యాప్, సెక్యూరిటీ చెక్ పేజీలో కనిపించనున్నాయి. వీటిని డిసేబుల్ చేయాలంటే సెట్టింగ్స్ లో అడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అక్కడ గెట్ రికమండేషన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆఫ్ చేయడం ద్వారా యాడ్లు రాకుండా ఆపేయవచ్చు.

అయితే షియోమీ ఫోన్లలో ఇది సాధ్యం కాదు. వారు ప్రతి ఒక్క ప్రకటనను మాన్యువల్ గా ఆపాల్సి వస్తుంది. పోకో ఎఫ్1 వంటి కాస్త ఖరీదైన ఫోన్లలో కూడా ఇదే పరిస్థితి. రియల్ మీ బ్రాండ్ భారతదేశంలో అడుగుపెట్టిన వద్దనుంచి బడ్జెట్, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లపై ఎక్కువగా దృష్టి పెట్టింది. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లను అందించే ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా రియల్ మీ భారతదేశంలో వేగంగా పుంజుకుంది. రియల్ మీ తాజాగా రియల్ మీ ఎక్స్2 పేరిట మరో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ను అందించగా.. ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ గా ఉండటం విశేషం. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్ కాగా, ఇందులో సూపర్ నైట్ స్కేప్ ఫీచర్ కూడా ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ద్వారా 30 నిమిషాల్లోనే 65 శాతం చార్జింగ్ అవుతుందని రియల్ మీ తెలిపింది.

Related posts