ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమాని సెలెబ్రిటీలంతా అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన విషయాలను, ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా వల్ల సెలెబ్రెటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గింది. అంతేకాదు సోషల్ మీడియా అనేది ఎవరైనా చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్పేందుకు వేదికగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నారు. ప్రముఖ కవి, దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ట్విటర్లోకి ప్రవేశించారు. ‘Sirivennela Official @sirivennela1955’ ఐడీతో ట్విటర్ ఖాతాను ప్రారంభించారు. “సోషల్ మీడియాలో యాక్టివ్ అవుదామనే కోరిక కలిగింది. నా అభిప్రాయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా సాహితీ వ్యాసాంగాల గురించి మీ అభిప్రాయలను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే ట్విటర్లోకి ప్రవేశిస్తున్నాను. Sirivennela Official@sirivennela1955 ఐడీతో అకౌంట్ ప్రారంభించాను” అని సీతారామశాస్త్రి పేర్కొన్నారు. పలువురు సినీ ప్రముఖులు ట్విటర్లోకి సిరివెన్నెలకు ఆహ్వానం పలికారు.
— Sirivennela Official (@sirivennela1955) June 4, 2020


నాడు 18 సీట్లు నేడు ఒక్కటి .. వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు