ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు కలిసి నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. నివేద థామస్, అదితిరావ్ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందించారు. పీ.జీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాని మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ సినిమాను ఓటీటీ లో ఈ చిత్రాన్ని భారతదేశంతో 200 దేశాలు మరియు టెర్రిటోరియాస్లో ఉన్న ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 5న డిజిటల్ ప్రీమియర్ను వీక్షించవచ్చని చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేసింది. ఇటీవల విడుదలైన యాక్షన్ ప్యాకెడ్ ”వి” ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమానుంచి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిందిం చిత్రయూనిట్ తాజాగా మరో పాటను విడుదల చేసింది. తాజాగా ఈ సినిమాలోని ‘బేబీ టచ్ మీ నౌ’ అనే మరో వీడియో సాంగ్ ని విడుదల చేశారు.నివేదా థామస్ ఎక్సప్రెషన్స్ మరియు సుధీర్ బాబు డ్యాన్స్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.
previous post
నో … స్పందించను..!