నటిగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు జయలలిత. టాప్ హీరోయిన్ జయలలిత తెలుగు, తమిళం, కన్నడ భాషలలో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది. భారత రాజకీయాలలోను ముఖ్య పాత్ర పోషించిన జయలలిత దాదాపు 14 సంవత్సరాలకి పైగా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలని నిర్వర్తించింది. తమిళ తంబీలు అమ్మగా పిలుచుకొనే జయలలిత అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమెపై బయోపిక్ రూపొందించేందుకు దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు.
పురుచ్చతలైవీ జయలలిత జీవిత నేపథ్యంలో తమిళ దర్శకురాలు ప్రియదర్శిని “ది ఐరన్ లేడీ” పేరుతో జయలలిత బయోపిక్ రూపొందిస్తుంది. ఇందులో నిత్యామీనన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తాను తలైవీ అనే టైటిల్‌తో జయలలిత బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న జయలలిత బయోపిక్ లు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక తాజాగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శశి లలిత పేరుతో జయలలిత జీవిత నేపథ్యంలో సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జయలలిత ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో ఏం జరిగింది ?అనేది ఇందులో చూపించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో జయలలితగా కాజోల్ నటించనుండగా, శశికళగా అమలాపాల్‌ని ఎంపిక చేసారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించేవరకూ వేచి చూడాల్సిందే.


ఆధిపత్యం కోసమే “మా” గొడవలు… తమ్మారెడ్డి భరద్వాజ