టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలకు శ్రీకారం చుట్టారు చిత్ర దర్శకుడు సాగర్.కె.చంద్ర. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్న విషయం విదితమే.అయితే… తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా షూటింగ్ స్వాట్కు వచ్చారు. పవన్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. పవన్ ఎంట్రీకి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తాజాగా రిలీజ్ చేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2021 లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
							previous post
						
						
					
							next post
						
						
					
