అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని అఖిల్ లుక్‌ను ఇప్పటికే విడుదల చేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వేసే ఏడడుగుల్లో ఒక అడుగు ఇదోగనంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫిబ్రవరి 8న వదిలారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల ప్రచార చిత్రాలు అన్నీ కూడా విశేష స్పందన అందుకున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు కూడా మంచి స్పందన అందుకున్నాయి. ఇక టీజర్ విషయానికొస్తే అందరిని ఆకట్టుకున్నే టీజర్ వైరల్ అయింది. ప్రతి విషయంలో అభిమానులను ఆకట్టుకున్న చిత్ర యూనిట్ సంక్రాంతి సందర్భంగా మరో సర్ప్రైజ్ను సిద్దం చేసింది. సంక్రాంతి పోస్టర్ విడుదల చేసి అందరిని అలరించింది. అభిమానులకు సంక్రాంతి సుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్మాత బన్నీ వాసు సన్నాహాలు చేస్తున్నారట.
previous post
next post
అల్లు అర్జున్ ఒక్కడే రియల్ మెగాస్టార్..