telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్ 30, గురువారం రాశిఫలాలు

మేషరాశి..

ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రముఖుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తెలియని వారిని నమ్మడం మానుకోండి. అలసట పెరగకుండా చూసుకోవాలి.

వృషభరాశి..

రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. వాహనయోగం క‌లుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.

మిథునరాశి..

స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి . బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు .ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు త‌ప్ప‌వు. అనారోగ్యం సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

కర్కాటకరాశి..

కష్టానికి త‌గాన ఫలితం ల‌భించ‌దు. కొందరు ప్రవర్తన వలన మానసిక చికాకులు పెరుగుతాయి. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి . అనారోగ్యం. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

సింహరాశి..

చిన్ననాటి స్నేహితుల‌ను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు . చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొత్త వ‌స్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కన్యరాశి..

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. భూవివాదాలు తొలుగుతాయి. ఆకస్మిక ధనలాభం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ప్రయత్నాలు సిద్ధిస్తాయి.

తులరాశి..

కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. శ్రమకు ఫలితం కనిపించదు. బందువుల‌తో ఆస్తి వివాదాలు తొలుగుతాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికరాశి..

వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. బంధుమిత్రులతో గొడ‌వ‌లు ఏర్ప‌డ‌తాయి, దూరప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యభంగం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు ఎక్కువ‌వుతాయి.ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

ధనుస్సురాశి..

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వేడుకలకు హాజరవుతారు. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి . ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి క‌నిపిస్తుంది. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

మకరరాశి..

కుటుంబ అనుకోని సమస్యలు ఎదుర‌వుతాయి. దైవదర్శనాలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి. అయిన‌వారితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో పెద్ద‌ల‌నుంచి ప్రోత్సాహం ల‌భిస్తుంది.

కుంభరాశి..

కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చేర్పులు ఉంటాయి. ప్ర‌ముఖుల‌తో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ధనలాభం క‌లుగుతుంది. పాతమిత్రుల‌ను కలుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది.

మీనరాశి..

చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు . కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. బంధుమిత్రులు కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. భూవివాదాలు ఎక్కువ‌వుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. దైవ ద‌ర్శ‌నాలు చేయ‌డం మంచిది

 

Related posts