telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీజర్ రిలీజ్‌..

టాలీవుడ్ యంగ్‌ హీరో శర్వానంద్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్​ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది.

ప్రతి మోగాడి జీవితం పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అనే శర్వానంద్‌ డైలాగ్‌తో టీజర్‌ ముదలవుతోంది.ఇందులో శర్వానంద్ పెళ్లి కానీ యువకుడి పాత్రలో నటించారు. ఎంతో మంది పెళ్లి చూపులు చూసిన హీరో వారందరిని రిజెక్ట్‌ చేస్తాడు. చివరకు హీరోయిన్‌ రష్మికతో లవ్‌లో పడతాడు. కానీ హీరోని హీరోయిన్‌ రిజెక్ట్‌ చేస్తుంది.

Sharwanand, Rashmika Mandanna Starring Aadavallu Meeku Johaarlu Teaser Released

హీరోయిన్ పైనే ఆశలు పెట్టుకుంటాడు. కానీ ఆమె కూడా ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడనేదే కథ. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమాలో సీనియర్‌ నటి రాధిక శరత్‌ కుమార్‌, ఖుష్బూ సందర్‌, ఊర్వశిలు ముఖ్యమైన పాత్రలో నటించారు.

Aadavallu Meeku Johaarlu Starring Sharwanand & Rashmika Mandanna Makes 25  Crores From Non-Theatrical Rights

ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Related posts