హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా & మురుగు నీటి పారుదల మండలి
జలమండలి ఉద్యోగుల క్షేమం కోసమే ఆరోగ్య శిబిరాలు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఎండీ దానకిశోర్ అన్నారు. జలమండలిలో పనిచేసే ఉద్యోగుల కోసం నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఎండీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల క్షేమం కోసం ఏటా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.