ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది.
కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.