ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను తుదముట్టించాం – ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నారు – మా ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది – త్రివిధ దళాలు చక్రవ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కరి చేశాయి – పహల్గాం ఘటనకు జవాబుగా 23 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టాం – మన మహిళల సిందూరం చెరిపిన వాళ్లను మట్టిలో కలిపేశాం – భారత్ లో రక్తపుటేర్లు పారించినవాళ్లను ముక్కలు ముక్కలు చేశాం – ఆపరేషన్ సిందూర్.. న్యాయానికి కొత్త రూపం – ఆపరేషన్ సిందూర్.. సమర్థ భారత రౌద్ర రూపం – ఇకపై ఉగ్రదాడి జరిగితే.. మన సమాధానం ఇలాగే ఉంటుంది – ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి జవాబే దక్కుతుంది – పాకిస్థాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మన ఎంపీలు విదేశాలకు వెళ్లారు – పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని మన ఎంపీలు ప్రపంచానికి చాటుతారు – పాక్ ఎప్పుడూ నేరుగా యుద్ధం చేయలేదు – దొంగదెబ్బ తీయడమే పాకిస్థాన్ కు తెలుసు – ఇక్కడ మోదీ ఉన్నాడన్న సంగతి పాకిస్థాన్ మరిచిపోయినట్టుంది – రాజస్థాన్ లోని ఎయిర్ బేస్ ను ధ్వంసం చేయాలని పాక్ ప్రయత్నించింది – కానీ.. రాజస్థాన్ ఎయిర్ బేస్ ను పాకిస్థాన్ క్షిపణులు తాకలేకపోయాయి – మన వాయుసేన మాత్రం పాక్ లోని ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది : ప్రధాని మోదీ

