- మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు ముట్టడించారు.
- కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళలు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. - భారీగా మొహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.
విజయవాడ జీజీహెచ్ అత్యాచార బాధితుల కుటుంబ సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆసుపత్రిలో దాడికి తెగబడ్డ నిందితులపై తీసుకున్న చర్యలేంటని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడుల్లో ఇప్పటివరకూ ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
మరోవైపు.. విజయవాడ ఆసుపత్రిలో చంద్రబాబు తనను దూషించారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చంద్రబాబు, బొండా ఉమలకు నోటీసులు జారీ చేసారు. నేడు వారు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే.. తమకు నోటీసులు ఇచ్చే అధికారం కమిషన్ కు లేదని.. తాము హాజరు కావట్లేదని బొండా ఉమ అన్నారు.

