telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “లూజర్” ట్రైలర్

Loser

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో వెబ్ సిరీస్‌‌లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు మంచి కంటెంట్, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. అదే కోవలో జీ5 ఓ సరికొత్త కథాంశంతో Loser అనే సిరీస్ తెరకెక్కించింది. ప్రియదర్శి, శశాంక్, పావని గంగిరెడ్డి, కోమలి ప్రసాద్, కల్పిక, షాయాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. జీవితంలో ఓ లక్ష్యం ఏర్పరచుకుని అనుకోని పరిస్థితులు, సొంత కారణాల వల్ల వాటిని చేరుకోలేకపోవడం అనేది ఈ ట్రెలర్‌లో ప్రధానంగా కనిపించింది. డైలాగ్స్, ఫొటోగ్రఫీ, ఆర్ఆర్ బాగున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts